BDK: సుజాతనగర్ మండల రైతులకు యూరియా కష్టాలు తీర్చాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కు వినతి పత్రం అందజేశారు. ఒకపక్క పంటలు పండి చేతికొచ్చే సమయంలో రైతులు సొసైటీ కార్యాలయాల చుట్టూ యూరియా బస్తాల కోసం తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రైతులకు న్యాయం చేయాలని కోరారు.