KMM: టీబీ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వరికూటి సుబ్బారావు సూచించారు. శుక్రవారం ముదిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి వైద్య సేవలను పరిశీలించారు. పిల్లల్లో లక్షణాలను త్వరగా గుర్తిస్తే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చన్నారు. దగ్గు, జ్వరం ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని కోరారు.