VKB: జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ధారసింగ్ యాదవ్ నియమితులవడంతో కోట్ పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. నినాదాలు చేస్తూ, టపాకాయలు కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.