వనపర్తి: జిల్లాలో విద్యుత్ సరఫరాలో ఆటంకం లేకుండా నిరంతర విద్యుత్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని, విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతిరోజు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రజలకు ఎవరైనా విద్యుత్ సమస్యలు ఉంటే 1912 హెల్ లైన్‌కు ఫోన్ చేయాలన్నారు.