ASF: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ తిర్యాని మండల అధ్యక్షులు చిత్తూరు సాగర్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన కళ్యాణ అరుణకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 50వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శుక్రవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన అందజేశారు. నిరుపేదల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నారు.