WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం MCPIU ఆధ్వర్యంలో సీనియర్ అసిస్టెంట్‌కు కోతుల, కుక్కల బెడదను నివారించాలని నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకురాలు రాగసుధ మాట్లాడుతూ.. పట్టణంలో కుక్కలు, కోతుల బెడదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు కుక్కల కోతుల నుంచి రక్షించాలని కోరారు.