ADB: నార్నూర్ మండల కేంద్రంలోని కొమురంభీం భవనంలో ఆదివారం ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్బంగా మండల గౌరవ అధ్యక్షుడిగా మెస్రం లింగోజి రావు, అధ్యక్షుడిగా అర్క గోవిందరావు, ప్రధాన కార్యదర్శిగా సర్పం సంతోష్ లను ఆదివాసీ పెద్దలు ఎన్నుకున్నారు. ఆదివాసీల సమస్యల పరిష్కారం, సంఘం బలోపేతానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.