GDWL: మానవపాడు మండల కేంద్రంలో శుక్రవారం కేవీపీఎస్ (కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి) జెండాను గద్వాల్ జిల్లా కార్యదర్శి రాజు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కుల కోసం, కుల వివక్షత, అంటరానితనంపై తమ సంఘం విరోచితంగా పోరాడుతుందన్నారు. పేద ప్రజల పక్షాన కేవీపీఎస్ నిలబడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.