WGL: వర్ధన్నపేటలో ఆగస్టు 25న జనహిత పాదయాత్ర జరగనుంది. ఈ పాదయాత్రలో TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఇతర నేతలు పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ఇల్లంద మార్కెట్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు పాదయాత్ర చేపట్టి, అనంతరం కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తరలిరావాలని నేతలు ఇవాళ కోరారు.