అన్నమయ్య: కోడూరు మండలంలోని మైనూరు వారి పల్లె వద్ద ఆదివారం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే బైక్ ఢీకొనడంతో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.