అన్నమయ్య: జిల్లా రైల్వేకోడూరులో విషాదం చోటుచేసుకుంది. మైనూరు హారిపల్లి ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు వ్యక్తులు తిరుపతి నుంచి బైక్పై వస్తుండగా, ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వెంకటమ్మ అక్కుడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.