ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కొండపల్లి MPUPS పాఠశాలలో విద్యార్థులకు పురుగులు పట్టిన బియ్యంతో భోజనం వడ్డించిన ఘటనపై జిల్లా అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ నిర్లక్ష్యానికి బాధ్యునిగా చేస్తూ పాఠశాల HM వెంకటేశ్వరును సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. HIT TV కథనాల ద్వారా విషయం వెలుగులోకి రావడంతో ఈ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.