JGL: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 33 ఫిర్యాదులు వచ్చినట్టు కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బీఎస్ లత, గౌతంరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.