BHPL: కాటారం మండలం చింతకాని ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ స్కూల్ డీహెచ్ఈడబ్ల్యూ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల HM శైలజ బాల్య వివాహాలు, బాల కార్మికత్వం, బేటీ బచావో-బేటీ పడావో, ఆడపిల్లల చదువు-రక్షణ, బాలల హక్కులు, సోషల్ మీడియా దుష్ప్రభావాల పై పాఠశాల బాలికలకు అవగాహన కల్పించారు.