KNR: రోడ్డుపై దొరికిన బంగారు పుస్తెలతాడును యువకులు బాధితురాలికి అందజేసి నిజాయితీ చాటుకున్నారు. మల్యాలవాసి స్రవంతి రోడ్డుపై వెళ్తూ పుస్తెలతాడు పోగొట్టుకుంది. ఈ క్రమంలో ఆ రోడ్డులో వెళ్తున్న జమ్మికుంట మాచనపల్లి వాసులు తిరుపతి, ప్రశాంత్ తాడును గమనించి స్థానిక PSలో అప్పజెప్పారు. అనంతరం ఈ విషయాన్ని వాట్సాప్లో వైరల్ చేశారు. అనంతరం బాధితురాలకు అందజేశారు.