NLG: MG యూనివర్సిటీ NSS ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉపకులపతి ఆచార్య అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం అధికారులతో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సామాజిక సమస్యగా ముందుకు వచ్చిన డ్రగ్స్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.