6.5 Crore Cash Seize: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. మరో 10 రోజుల్లో క్యాంపెయిన్ ముగియనుంది. ఓటర్లను ఆకట్టుకునే పనిలో అభ్యర్థులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే మద్యం, చీరలు, గిప్ట్స్, నగదు ఆయా నియోజకవర్గాలకు చేరుతోంది. ఎక్కడికక్కడ చెక్ పోస్ట్స్ ఏర్పాటు చేసినప్పటికీ నిత్యం భారీగా నగదు పట్టుపడుతోంది.
హైదరాబాద్లో శనివారం భారీగా నగదు పట్టుబడింది. అప్పా జంక్షన్ (appa junction) వద్ద రూ.6.5 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి (ponguleti srinivas reddy) చెందినదిగా భావిస్తున్నారు. ఆరు కార్లలో డబ్బు తరలిస్తోండగా పట్టుకున్నారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు. ఆ మనీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రలోభాల పర్వం జోరందుకుంది. ఊరు, వాడ, గల్లీలో ఓట్ల కట్టలు పంచే కార్యక్రమంలో నేతలు బిజీగా ఉన్నారు. ఏ చిన్న అవకాశం ఉన్న సరే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.