SRD: ప్రయాణికులను సకాలంలో గమ్యస్థానానికి క్షేమంగా చేర్చాలని ఖేడ్ ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేశం అన్నారు. శుక్రవారం తెల్లవారు జామున డిపోలో డ్రైవర్లతో ఆయన సమావేశమయ్యారు. నేడు డ్రైవర్స్ డే సందర్భంగా వారికి గులాబీ పూలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులోనే సుఖవంతమైన ప్రయాణమని ప్రజలకు గట్టి నమ్మకం ఉందన్నారు.