SRPT: హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేపల సింగారం గ్రామంలో తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసుకొని దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరులేనిది గమనించిన దుండగులు బుధవారం మధ్యహ్నం ఇంట్లోకి చొరబడ్డారు. 6 తులాల బంగారం, లక్ష రూపాయల నగదు చోరీకి గురైనట్లు ఇంటి యజమాని గోపిరెడ్డి తెలిపారు.