NRPT: మరికల్ మండల కేంద్రంలో ఇంధన కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి కోతల సమయంలో డీజిల్ కోసం బంకుల వద్ద భారీ క్యూలు ఏర్పడ్డాయి. నాలుగు బంకుల్లో ఒకచోటే స్టాక్ ఉండటంతో రైతన్నలు డబ్బాలతో గంటల తరబడి వేచి చూస్తున్నారు. వర్ష సూచనల నేపథ్యంలో పంటను కాపాడుకునేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.