SRPT: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని మాజీ మంత్రి, సూర్యాపేట MLA గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం పితృ అమావాస్యతో ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాలు, దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఐక్యతతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ప్రకృతిని ఆరాధిస్తూ నిర్వహించుకునే బతుకమ్మ తెలంగాణ ఉద్యమంతో ఖండాంతరాలకు విస్తరించిందని తెలిపారు.