MNCL: మందమర్రి కాంగ్రెస్ కార్యాలయంలో 82 మంది లబ్ధిదారులకు కల్యాణనలక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. గత పదేళ్ల BRS పాలనలో అక్రమ కేసులు, అక్రమ అరెస్ట్‌లతో KCR రాచరిక పాలన సాగించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని పేర్కొన్నారు.