ATP: రాయదుర్గం పట్టణంలో నేటి నుంచి ప్రారంభమైన ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి మంగళవారం పిలుపునిచ్చారు. పట్టణంలోని వివిధ సచివాలయాలలో నిర్వహించనున్న ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలలో మార్పులు, చేర్పులు, చిన్నపిల్లలకు ఇప్పటివరకు ఆధార్ నమోదు లేని వారికి ఉచితంగా ఆధార్ నమోదు చేయనున్నట్లు తెలిపారు.