WNP: ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామస్తులు శుక్రవారం ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. మస్తీపురంలో బీటీ రోడ్డు పనులు జరుగుతుండటంతో గద్వాల నుంచి ఆత్మకూరుకు వెళ్లే బస్సులను తాత్కాలికంగా మూలమల్ల మీదుగా తిప్పుతున్నారు. కేవలం అవసరాల మేరకే తమ గ్రామం మీదుగా బస్సులను నడుపుతున్నారని, శాశ్వతంగా తమకు బస్సులు వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.