NLG: జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల్లో భాగంగా బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ‘నో హెల్మెట్- నో పెట్రోల్’ నిబంధనను అమలు చేనునట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. ఈ నిర్ణయం ప్రకారం జిల్లా పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో హెల్మెంట్ ధరించకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ సరఫరా చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.