KNR: బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న పిల్లలకు గ్రామ ప్రత్యేకాధికారి, తహశీల్దార్ వి. శ్రీనివాస్ రెడ్డి గురువారం యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, వారికి ప్రభుత్వం అందజేస్తున్న పౌషికారమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా అందించాలని కోరారు.