SRCL: నేటి నుంచి ప్రజలకు నూతన జిల్లా పోలీస్ కార్యాలయం అందుబాటులో ఉంటుందని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపార. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలో నిర్మించిన పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజలకు నేటి నుంచి అందుబాటులో ఉంటూ సేవలందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.