AP: రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో రూ.1.87 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎన్టీపీసీ సిద్ధమయింది. దీని ద్వారా రాష్ట్రానికి 25 ఏళ్లలో రూ.20, 620 కోట్ల ఆదాయం రానుంది. 1.06 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. సీఎం, మంత్రులు లోకేష్, గొట్టిపాటి సమక్షంలో ఎన్జీఈఎల్- ఎన్ఆర్ఈడీసీఏసీ మధ్య ఒప్పందం కుదిరింది.