NZB: ఎల్లారెడ్డి ఐకేపీ కార్యాలయంలో శుక్రవారం గ్రామ సంఘాలకు సంబంధించి అంతర్గత ఆడిట్‌ను అధికారులు నిర్వహించారు. గ్రామ సంఘాల ఆదాయ, వ్యయాల వివరాలున్న రికార్డులను పరిశీలించారు. 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రికార్డులను పరిశీలించినట్లు ఆడిట్ అధికారులు తెలిపారు. రికార్డులు నిర్వహణ సజావుగా ఉందని తెలిపారు. ఏపీఎం ప్రసన్న రాణి, ప్రతినిధులు పాల్గొన్నారు.