HYD: కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ మందుమూల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ మల్లాపూర్ కురుమ సంఘం నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కురుమ సంఘం నాయకులు ఆయనకు తలపాగను చుట్టి కురుమల సాంప్రదాయాన్ని చాటుకున్నారు.