MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం హెచ్ఆర్ఏ ఇప్పించాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి కోరారు. ఆదివారం ఆయన కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులకు 6 పెండింగ్ డీఏలు, పాత పెన్షన్ విధానం అమలు, 317 జీఓ బాధితులకు న్యాయం చేయాలని కోరారు.