NGKL: నాగర్ కర్నూల్ మండలం చందుబట్లలో మంగళవారం రాత్రి ఓ ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనానికి దారి ఇచ్చే క్రమంలో అదుపు తప్పిన ట్రాక్టర్-ట్రాలీ రోడ్డు పక్కన ఉన్న గుంత లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. స్థానికులు స్పందించి డ్రైవర్ను క్షేమంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.