NZB: రుద్రూర్ మండలం అంబం (ఆర్) లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ టీకాల కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కుర్లెపు గంగాధర్, ఉప సర్పంచ్ రేపల్లి సాయిప్రసాద్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పశువుల ఆరోగ్యంపై జీవాల పెంపకందారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ టీకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.