KMM: వేంసూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం పాఠశాల విద్యార్థులు స్వయం పాలన దినోత్సవం నిర్వహించారు. 40 మంది విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బందిగా వ్యవహరించి తమ అనుభవాలను వ్యక్తం చేశారు. ఈ ఒక్క రోజు విద్యార్థులు ఉపాధ్యా యులుగా మారి విద్యార్థులకు విద్యా బోధనలతో తమ ప్రతిభను చాటుకున్నారు.