RR: జంట జలాశయమైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు గత కొద్దిరోజులుగా వరద ప్రవాహం కొనసాగింది. అయితే గత రెండు, మూడు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో జలాశయాలకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో జలాశయాల గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం 300 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తున్నట్లు అధికారులు తెలిపారు.