MDK: శివంపేట మండలం రత్నాపూర్ అంగన్వాడీ కేంద్రంలో అస్వస్థతకు గురైన విద్యార్థులు నర్సాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి అస్వస్థతకు గురైన పలువురు పిల్లలను వైద్య పరీక్షలు నిర్వహించి ఇంటికి పంపించగా, రాత్రివేళ మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు బాధితులు తెలిపారు. వెంటనే మరోసారి నర్సాపూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు.