HNK: జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అడ్వాన్స్డ్ సీపీఆర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హనుమకొండ రెడ్ క్రాస్ ఛైర్మన్ విజయ చందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలందరూ శాస్త్రీయ పద్ధతులను అనుసరించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో డా. రామక శ్రీనివాస్, జి. శివ కుమార్, శ్రీధర్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.