MHBD: కొత్తగూడ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం ఉదయం సుపరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై ఇమ్మడి రాజుకుమార్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసు సిబ్బందికి దేశభక్తి, క్రమశిక్షణ, ప్రజాసేవపై ఎస్సై అవగాహన కల్పించారు. దేశ భద్రతలో ప్రతిఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని పిలుపునిచ్చారు.