MDK: హవేలీఘనపూర్ మండలం తొగిట గ్రామంలో గణేశ్ నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. వినాయకుడి నిమజ్జనం కోసం చెరువులోకి దిగిన ఓ యువకుడు నీట మునిగి మరణించాడు. గ్రామానికి చెందిన మొండి ప్రభాకర్ కుమారుడు సుధాకర్(17) శుక్రవారం సాయంత్రం రామస్వామి కుంట వద్ద నిమజ్జనం అనంతరం కనిపించకుండా పోయాడు. నిర్వాహకులు, గ్రామస్థులు వెతకగా, అతని మృతదేహం బయటపడింది.