సత్యసాయి: కదిరి మున్సిపల్ 16వ వార్డు బేరిపల్లి కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి నెలా సమయానికి పింఛన్లు అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.