ASF: ఆసీఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ హైదరాబాద్లోని సెక్రటేరియట్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని సోమవారం అయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధికి, కొత్తగా ఏర్పడిన ఆసీఫాబాద్ మున్సిపాలిటీకి ఎక్కువ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని డిప్యూటీ CM హామీ ఇచ్చారని MLA తెలిపారు.