NZB: తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే CM రేవంత్ రెడ్డి BRS అధినేత కేసీఆర్పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని బాల్కొండ MLA వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. KCR, KTR లపై కొడంగల్ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. చేసినవి చెప్పుకోడానికి లేకనే వ్యక్తిగత దూషణల దిగుతున్నాడన్నారు.