SDPT: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చందలాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ జడ్పీ చైర్మన్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ ఇంట్లో జరుగుతున్న పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.