NLG: దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన కళాశాల అల్మనక్ను సోమవారం ప్రిన్సిపల్ డా. రమావత్ రవి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడ్మిషన్ పొందిన ప్రథమ సంవత్సర విద్యార్థులు తమ తమ తరగతులకు హాజరు కావాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ జీ. కోటయ్య తదితరులున్నారు.