WGL: సంగెంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం కబడ్డీ పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్టుపల్లి ఏలియా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడాకారులు స్నేహపూర్వకంగా ఆడుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంగెం ఎంఈఓ రాము, శ్రీధర్, ముఖర్జీ, శ్రీనివాస్, రతన్ సింగ్ రాథోడ్, రవీందర్ తదితరులున్నారు.