KMM: కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను ఇంటింటికి చేరవేసి ఐక్యంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. ఆదివారం ఖమ్మం 42డివిజన్ లో చేపట్టిన జై బాపు! జై భీమ్! జై సంవిధాన్ యాత్రలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 15 నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు.