MDK: మహమ్మద్‌నగర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఫిజియోథెరపిస్ట్ అరుణ్ కుమార్ శుక్రవారం ఫిజియోథెరపీ చికిత్సలు నిర్వహించారు. పిల్లల వ్యాయామాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ వ్యాయామాలు చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రాజ్, కాంప్లెక్స్ సిఆర్పి శంకర్ గౌడ్, ఐఆర్పీలు సునీల్, సాయిలు ఉన్నారు.