NGKL: జిల్లాకు చెందిన బీనమోని మధు ప్రియ జాతీయ స్థాయి క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో 4 కి.మీ. పరుగు పందెంలో ఆమె రజత పతకం సాధించారు. ఈ నెల 23 నుంచి జార్ఖండ్లో జరిగే జాతీయ పోటీల్లో మధు ప్రియ పాల్గొంటారని కోచ్ పరశురాముడు తెలిపారు. ఆమె ప్రతిభను పలువురు అభినందించారు.