HYD: ఎండల తీవ్రతతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో టీజీఎస్పీడీసీఎల్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, లోడ్ వివరాలను సేకరించి ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లను ముందుగానే గుర్తించారు.