VKB: మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని వికారాబాద్ జిల్లా ఎన్నికల పరిశీలకురాలు యాస్మిన్ భాష తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని ఐదు మండలాల్లో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎన్నికల పరిశీలకురాలు యాస్మిన్ భాష అధికారులతో కలిసి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు.